స్వల్ప లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్ సూచీలు...! 17 d ago
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సాంకేతిక నిర్ణయాలపై మదుపర్లు దృష్టిపెట్టనున్నారు. దీనితో సూచీలు ఫ్లాట్ గా కదులుతున్నాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 155 పాయింట్ల లాభంతో 81,112 వద్ద, నిఫ్టీ 41 పాయింట్లు లాభంతో 24,510 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ 4 పైసలు పెరిగి 84.71గా ట్రేడ్ అవుతుంది.